సౌరవ్ ను గుర్తుచేస్తున్న స్మ్రితి

Update: 2018-11-22 10:45 GMT

టీమిండియాకు బ్యాట్స్ మెన్ గా, కెప్టెన్ గా ఎన్నో అమూల్యమైన విజయాలే అందించిన ఆటగాడు సౌరవ్ గంగూలీ. అభిమానులు బెంగాల్ టైగర్ గా పిలుచుకునే సౌరవ్ ఆట అంటే యమ క్రేజ్ ఉండేది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ లో సౌరవ్ ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడే వాడు. అయితే, 2012 చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడి గంగూలీ పూర్తిగా క్రికెట్ కి గుడ్ బై చెప్పి కామెంటేటర్ గా సెటిల్ అయ్యాడు. దీంతో గంగూలీ బ్యాటింగ్ చూసే అవకాశం అభిమానులు కోల్పోయారు. అయితే, ఇప్పుడు క్రికెట్ లవర్స్ కి, సౌరబ్ అభిమానులకు గంగూలీని గుర్తు చేస్తోంది టీమిండియా మహిళా క్రికెటర్ స్మ్రితి మంధన.

ఆఫ్ సైడ్ షాట్లు చూస్తే...

ముంబయికి చెందిన 23 ఏళ్ల స్మ్రితి భారత్ తరపున ప్రపంచ క్రికెట్ లో రాణిస్తోంది. ఓపెనింగ్ కి దిగే ఈ లెఫ్ట్ హ్యాండ్ క్రికెటర్ హావభావాలు, బ్యాటింగ్ చేసే విధానం అచ్చం సౌరవ్ గంగూలీని తలపిస్తోంది. ఆటతీరు కూడా పూర్తిగా గంగూలీ మాదిరిగానే ఉంటుంది. ఇక ఆఫ్ సైడ్ షాట్లు కొట్టడంలో, మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ లు కొట్టడం చూస్తే కచ్చితంగా గంగూలీ గుర్తుకు రావాల్సిందే. గంగూలీ మాదిరిగానే నిలకడగా పరుగులు చేస్తూ స్మ్రితి టీమిండియాకు మంచి ఓపెనర్ గా మారింది. ఇప్పటివరకు 44 వన్డే మ్యాచ్ లు ఆడిన స్మ్రితి 39.07 సగటుతో 1602 పరుగులు చేసింది.

Similar News