వివేకా హత్య కేసుపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ దర్యాప్తుపై అనుమానం కలుగుతుందన్నారు. రెండేళ్లుగా [more]

Update: 2021-08-22 05:43 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ దర్యాప్తుపై అనుమానం కలుగుతుందన్నారు. రెండేళ్లుగా సీబీఐ వైఎస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్నా ఇంతవరకూ పురోగతి లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. దీనికితోడు సమాచారమిచ్చిన వారికి ఐదు లక్షల రివార్డు ప్రకటించడం కూడా పలు అనుమానాలకు తావిస్తుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకూ అనుమానితులుగా విచారణకు హాజరైన జగన్ బంధువులు నిర్దోషులుగా సీబీఐ నిర్ధారించిందా? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అసలు హంతకులను ఈ హత్య కేసు నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానం వస్తుందన్నారు.

Tags:    

Similar News