కొడాలి నానీ … ఒళ్లు దగ్గరపెట్టుకో

తిరుమల వెంకటేశ్వరస్వామిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. కొడాలి నాని వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులను [more]

;

Update: 2020-09-21 07:11 GMT

తిరుమల వెంకటేశ్వరస్వామిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. కొడాలి నాని వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులను కంట్రోల్ లో పెట్టుకోవాలని జగన్ కు సోము వీర్రాజు సూచించారు. దేవుడి పట్ల కొడాలి నాని వాడిన భాష హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. దీనిపై రాష్ట్రంలోని అన్ని ఆంజనేయ స్వామి దేవాలయాలలో వినతి పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. హిందూ ధర్మం గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గుళ్లు కూలగొట్టినప్పుడు చంద్రబాబు బుద్ధి ఏమైందని ప్రశ్నించారు సోము వీర్రాజు.

Tags:    

Similar News