వైసీపీ ఎమ్మెల్యే వీరంగం.. పోలీసులను కాదని?
శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే అప్పలరాజు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. పోలీసులపై ఎమ్మెల్యే అనుచరులు తిరగబడ్డారు. మార్చి 17వ తేదీన కొందరు శ్రీకాకుళం వాసులు వివాహవేడుకకు [more]
శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే అప్పలరాజు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. పోలీసులపై ఎమ్మెల్యే అనుచరులు తిరగబడ్డారు. మార్చి 17వ తేదీన కొందరు శ్రీకాకుళం వాసులు వివాహవేడుకకు [more]
శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే అప్పలరాజు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. పోలీసులపై ఎమ్మెల్యే అనుచరులు తిరగబడ్డారు. మార్చి 17వ తేదీన కొందరు శ్రీకాకుళం వాసులు వివాహవేడుకకు ఒడిశా వెళ్లారు. లాక్ డౌన్ ఉండటంతో వారు ఒడిశాలో చిక్కుకుపోయారు. దాదాపు 26 మందిని ఒడిశా నుంచి బస్సులో శ్రీకాకుళం తీసుకువచ్చేందుకు అప్పలరాజు ప్రయత్నించారు. పట్టుపురం చెక్ పోస్టు వద్ద పోలీసులు వారిని ఆపడంతో ఎమ్మెల్యేతో పాటు వారి అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే కారును కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. చివరకు అధికారులు జోక్యం చేసుకుని ఒడిశా నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ కు తరలించారు.