ఆంధ్రా నుంచి ఇక నో ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్ లో కొత్తరకం కరోనా వేరియంట్ భయపెడుతుంది. నిపుణులు కూడా దీనికి ఎన్ 440 అని పేరు పెట్టారు. ఇది అత్యంత ప్రమాదకరమైనదని, వేగంగా విస్తరిస్తుందని నిపుణులు [more]

Update: 2021-05-07 01:12 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్తరకం కరోనా వేరియంట్ భయపెడుతుంది. నిపుణులు కూడా దీనికి ఎన్ 440 అని పేరు పెట్టారు. ఇది అత్యంత ప్రమాదకరమైనదని, వేగంగా విస్తరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏపీ సరిహద్దుల్లోని రాష్ట్రాలు అన్ని తమ రాష్ట్రాల్లో రాకపోకలను నిలిపివేశాయి. సరిహద్దులను బంద్ చేశాయి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు సరిహద్దులను మూసివేశాయి. ఏపీనుంచి తమ రాష్ట్రంలోకి రావాలంటే కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ ఉండాలని చెబుతన్నాయి. ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ కూడా ఏపీ సరిహద్దును మూసివేసింది. సుక్మా జిల్లాలోని బోర్డర్ ను మూసివేసినట్లు ఛత్తీస్ ఘడ్ ప్రకటించింది.

Tags:    

Similar News