బ్రేకింగ్ : ‘ఓటుకు నోటు కేసు’లో సుప్రీం కీలక ఆదేశాలు

Update: 2018-11-22 07:12 GMT

ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కుమ్మక్కయ్యాయని, కనుక ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తనను ఏపీ, తెలంగాణ పోలీసులు వేధిస్తున్నారని, 24 గంటలు ఇంటి చుట్టూ పోలీసులు తిరుగుతున్నారని ధర్మాసనం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తెలంగాణ డీజీపీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో మత్తయ్యకు అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనకు రక్షణ కల్పించాలని తెలంగాణ డీజీపీకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన తరపున వాదించేందుకు న్యాయవాది కావాలని మత్తయ్య కోరగా సిద్ధార్థ ధవే అనే న్యాయవాదిని కోర్టు మత్తయ్య తరపున వాదించేందుకు నియమించింది.

Similar News