డిజిటలైజేషన్ వైపు టాటా.. ఫోన్ పే, జీ పే కు పోటీగా టాటా పే
టాటా గ్రూప్ దేశంలో స్వంత యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత డిజిటల్ చెల్లింపు సేవను అందించేందుకు నేషనల్ పేమెంట్స్
న్యూ ఢిల్లీ : డిజిటలైజేషన్ రేసులో ఫోన్ పే, గూగుల్ పే ముందున్నాయి. వాటి తర్వాతి స్థానాల్లో పేటీఎం, అమెజాన్ పే, వాట్సాప్ పే ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటికీ పోటీగా మరో డిజిటల్ పేమెంట్ యాప్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. టాటా పే పేరుతో టాటా గ్రూప్ డిజిటలైజేషన్ రేసులో అడుగు పెట్టనుంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే టాటా గ్రూప్ సొంత డిజిటల్ పేమెంట్ యాప్ ను ప్రారంభిస్తుందని తెలుస్తోంది.
ఒక నివేదిక ప్రకారం.. టాటా గ్రూప్ దేశంలో స్వంత యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత డిజిటల్ చెల్లింపు సేవను అందించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి కోరుతున్నట్లు సమాచారం. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్స్ గా వ్యవహరించేందుకు టాటా గ్రూప్ ఏపిఎన్‌ఐసికి దరఖాస్తు చేసిందని ఆ నివేదిక చెబుతోంది. టాటా గ్రూప్ టాటా న్యూ పేరిట డిజిటల్ సేవలను వీలైనంత త్వరగా లేదా వచ్చే నెలలో ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
ఈసారి టాటా ఐపీఎల్ సీజన్ జరుగుతుండగా.. ఈ ఐపీఎల్ సెషన్స్ లోనే టాటా గ్రూప్ ఈ యాప్ ను లాంచ్ చేయాలని భావిస్తోందట. ఈ యాప్ బిగ్‌బాస్కెట్, 1ఎంజి, క్రోమా, టాటా క్లిక్ వంటి అన్ని టాటా డిజిటల్ యాప్‌లను అలాగే ఫ్లైట్ బుకింగ్ సేవలను ఒకే యాప్‌లో వినియోగదారులకు సులభంగా యాక్సెస్ చేస్తుంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టాటా న్యూ పేమెంట్స్ యాప్ అందుబాటులోకి వస్తే.. ఫోన్ పే, జీ పే లకు గట్టి పోటీ వచ్చినట్లేనని డిజిటల్ నిపుణుల అంచనా.