హస్తినలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం
ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు
ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. రెండో రోజు యాగం పూర్తయిన తర్వాత ఆయన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. వేదపండితులు నిర్ణయించి ముహూర్తం ప్రకారం ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేసీఆర్ వెంట కర్ణాటక, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, అఖిలేష్ యాదవ్ లు ఉన్నారు.
జాతీయ రాజకీయాలపై...
ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు కూడా హాజరై బీఆర్ఎస్ కు సంఘీభావాన్ని ప్రకటించారు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించే కంటే ముందుగా కేసీఆర్ పార్టీ కొత్త కార్యాలయంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పార్టీ కార్యాలయంలోని తన ఛాంబర్ లో కొద్దిసేపు కూర్చున్నారు. హస్తినలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఇక ఢిల్లీ నుంచి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించనున్నారు.