ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఈ నెల 25వ తేదీన ఎంఐఎం తలపెట్టిన సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం సభ మాత్రమే జరుపుకోవాలని, ఎలాంటి ర్యాలీలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. [more]

;

Update: 2020-01-24 10:55 GMT

ఈ నెల 25వ తేదీన ఎంఐఎం తలపెట్టిన సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం సభ మాత్రమే జరుపుకోవాలని, ఎలాంటి ర్యాలీలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. జనవరి 25వ అర్ధరాత్రి సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం చార్మినార్ ప్రాంతంలో ర్యాలీని నిర్వహించాలనుకున్నారు. దీనికి పోలీసులు కూడా అనుమతిచ్చారు. ఎలా పోలీసులు అనుమతిస్తారని ఉమమహేంద్ర అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ వేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 11గంటల వరకూ ర్యాలీలకు అనుమతి ఇవ్వవద్దని పిటీషనర్ కోరారు. సభలో ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసే అవకాశం ఉందని పిటీషనర్ ఆరోపించారు. ఇరు వర్గాల వాదన విన్న హైకోర్టు ఎంఐఎం కు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సభ నిర్వహణకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సభను వీడియో తీయించాలని పోలీసులకు ఆదేశించింది.

Tags:    

Similar News