పోతిరెడ్డిపాడుపై తెలంగాణ హైకోర్టులో

రాయలసీమ ఎత్తిపోతల పథకం పై విచారణ చేపట్టేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. సోమవారం వంశీ చంద్ రెడ్డి, గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లు లిస్ట్ చేసేందుకు [more]

;

Update: 2020-08-19 07:16 GMT

రాయలసీమ ఎత్తిపోతల పథకం పై విచారణ చేపట్టేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. సోమవారం వంశీ చంద్ రెడ్డి, గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లు లిస్ట్ చేసేందుకు జస్టిస్ ఎంఎస్ రామచందర్ రావు నేతృత్వంలోని బెంచ్ అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశించినప్పటికీ ఎపి ప్రభుత్వం ఎత్తిపోతల పధకం విషయంలో ముందుకు వెళ్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివరించారు. ఎపి పునర్విభజన చట్టం సెక్షన్ 84కు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నారని పిటిషనర్ న్యాయవాది శ్రావణ్ కుమార్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసిందని, శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ తర్వాత విచారణ చేపట్టాలని ఎపి న్యాయవాది కోరారు. దీంతో కేసును ఈ నెల 24వ తేదీకి వాయిాదా వేసింది.

Tags:    

Similar News