నేడు తెలంగాణ కేబినెట్.. కీలక నిర్ణయాలు?
ఈరోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా లాక్ డౌన్ పై చర్చించనున్నారు. రేపటితో లాక్ [more]
ఈరోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా లాక్ డౌన్ పై చర్చించనున్నారు. రేపటితో లాక్ [more]
ఈరోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా లాక్ డౌన్ పై చర్చించనున్నారు. రేపటితో లాక్ డౌన్ ముగియనుంది. దీంతో మరికొంత సడలింపులు ఇచ్చి లాక్ డౌన్ ను కొనసాగిస్తారని తెలిసింది. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణలో కేసులు తగ్గుముఖం పడుతుండటంతో క్రమంగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో పాటు ఉద్యోగుల పీఆర్సీపై కూడా మంత్రివర్గ సమావేశం చర్చించే అవకాశముంది.