అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ వ్యూహకమిటీ సభ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతిపక్షం సభలో లేకపోయినా చర్చలు హుందాగా నడవాలని, అసెంబ్లీ బాగా జరిగిందని పేరురావాలని ఆయన కోరారు. అసెంబ్లీకి ఎందుకు వెళ్లలేదని ఇటీవలే వైసీపీని ప్రజలు నిలదీసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రతిపక్షం లేకున్నా......
ప్రతిపక్షం కోసం మనం పనిచేయడం లేదని, ప్రజల కోసమే పనిచేస్తున్నామన్న పేరు రావాలన్నారు. ప్రజలు అన్ని పరిణామాలనూ నిశితంగా గమనిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు, విప్ లు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. కాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిన్ననే ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తేనే సభకు వస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.