బ్రేకింగ్ : హైకోర్టులో కేసీఆర్ కు భారీ ఊరట

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. తెలంగాణ సచివాలయాన్ని ప్రభుత్వం కూల్చేవేసే ప్రయత్నం [more]

;

Update: 2020-06-29 05:35 GMT

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. తెలంగాణ సచివాలయాన్ని ప్రభుత్వం కూల్చేవేసే ప్రయత్నం చేస్తుందని, దీనిని అడ్డుకోవాలని వేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. కేబినెట్ నిర్ణయాన్ని తాము తప్పుపట్టలేమని హైకోర్టు అభిప్రాయపడింది. కొన్ని రోజుల నుంచి సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. చారిత్రక భవనాలను కూల్చివేయవద్దంటూ దాదాపు పది పిటీషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. అయితే ఈ పిటీషన్లన్నింటినీ హైకోర్టు కొట్టివేసింది.

Tags:    

Similar News