తెలంగాణలో టపాసులు బ్యాన్.. హైకోర్టు ఆదేశం

దీపావళి పండుగ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో బాణాసంచా ను బ్యాన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో దీపావళి [more]

;

Update: 2020-11-12 08:54 GMT

దీపావళి పండుగ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో బాణాసంచా ను బ్యాన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో దీపావళి టపాసులను బ్యాన్ చేయాలని న్యాయవాది ఇంద్రప్రకాష్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. టపాసులు పేల్చడం వల్ల ప్రజలతో పాటు కరోనా వైరస్ బాధితులు శ్వాసకోశ సమస్యలతో బాధపడే అవకాశముందని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు టపాసులను నిషేధించాలని ఆదేశించింది. ఉన్న షాపులను కూడా వెంటనే మూసివేయాలని ఆదేశించింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈ నెల 19వ తేదీన వివరించాలని ప్రభుత్వం హైకోర్టును ఆదేశించింది.

Tags:    

Similar News