ఓటమికి నాదే బాధ్యత
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఓడిపోవడానికి తనదే బాధ్యత అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ [more]
;
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఓడిపోవడానికి తనదే బాధ్యత అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ [more]
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఓడిపోవడానికి తనదే బాధ్యత అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హుజూర్ నగర్ లో ఓటమి, పార్టీ పరిస్థితి పై సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఆర్. సి. కుంతియాతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, ఏఐసీసీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు. పార్టీ పరిస్థితి, క్రమశిక్షణపై సీనియర్ నేత వీ హనుమంతరావు ప్రశ్నల వర్షం కురిపించారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని విహెచ్ సూచించారు. హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన ఖర్చును తట్టుకోలేకపోయామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.