ఇక బీజేపీయే నా టార్గెట్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై దశల వారీ పోరాటం చేయాలన్నారు
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై దశల వారీ పోరాటం చేయాలని నిర్ణయించారు. బీజేపీతో చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు. ఈ నెల 20 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ దిష్టిబొమ్మలను ఎక్కడికక్కడ దహనం చేయాలని కోరారు. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
రైతులను ప్రోత్సహించేలా...
వరికి ప్రత్యమ్నాయ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని కోరారు. రైతు వేదికల్లో వారిన చైతన్య పర్చాలని కేసీఆర్ కోరారు. త్వరలో టీఆర్ఎస్ కొత్త రాష్ట్ర కమిటీని నియమించనున్నట్లు తెలిపారు. అది కో-ఆర్డినేటరా? లేదా జిల్లా అధ్యక్షుడా? అన్నది రెండు రోజుల్లో నిర్ణయిస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కోటి సంతకాలను ప్రజల నుంచి సేకరించాలని కేసీఆర్ నేతలను ఆదేశించారు. ఎమ్మెల్యేలు లేని చోట ఇన్ ఛార్జులు సంతకాల సేకరణ చేయాలని కోరారు.
ఎమ్మెల్యేలకు క్లాస్....
ఇక ఎమ్మెల్యేలకు కేసీఆర్ క్లాస్ పీకారు. ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వారి సమస్యలను పట్టించుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను వారికి వివరిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కేసీఆర్ కోారు. జనాల్లో ఉండకపోతే ఎవరూ ఏమీ చేయలేరని ఎమ్మెల్యేలను సున్నితంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ పై దూకుడుగా వెళ్లాలనే కేసీఆర్ డిసైడ్ చేశారు. పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.