ఏపీని వేంకటేశ్వరస్వామి ఇలా?
ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ను తిరుమల తిరుపతి దేవస్థానం ఆదుకుంటోంది. టీటీడీ వద్ద నిధులకు కొరత లేదు. గత ఇరవై అయిదు రోజులుగా తిరుమలలో లాక్ డౌన్ [more]
ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ను తిరుమల తిరుపతి దేవస్థానం ఆదుకుంటోంది. టీటీడీ వద్ద నిధులకు కొరత లేదు. గత ఇరవై అయిదు రోజులుగా తిరుమలలో లాక్ డౌన్ [more]
ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ను తిరుమల తిరుపతి దేవస్థానం ఆదుకుంటోంది. టీటీడీ వద్ద నిధులకు కొరత లేదు. గత ఇరవై అయిదు రోజులుగా తిరుమలలో లాక్ డౌన్ అమలవుతోంది. శ్రీవారి ఆదాయం కూడా లేదు. అయినా ప్రజలకు సేవలందించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. ఇప్పటికే కరోనా వైరస్ ను సమర్థవంతంగా నియంత్రించేందుకు వైద్య పరికరాల కొనుగోలు కోసం 19 కోట్ల రూపాయలను కేటాయించింది. తాజాగా ఏపీలోని 13 జిల్లాలకు ఒక్కో జిల్లాకు కోటి రూపాయల చొప్పున 13 కోట్ల నిధులను టీటీడీ కేటాయించింది. ఈ సొమ్ముతో పేదలకు అన్నదానం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆకలితో అలమటించే వారి కోసం ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.