తెలంగాణలోనూ కొత్త రకం వైరస్ స్టెయిన్

దేశంలో రెండు కొత్త వైరస్ స్టెయిన్స్ బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, కేేరళ, తెలంగాణలో ఈ కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ కనుగొన్నామని [more]

;

Update: 2021-02-24 02:34 GMT

దేశంలో రెండు కొత్త వైరస్ స్టెయిన్స్ బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, కేేరళ, తెలంగాణలో ఈ కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ కనుగొన్నామని తెలిపింది. వీటిని ‘N44OK’, ‘E 484K’ వేరియంట్లుగా గుర్తించినట్టు తెలిపింది. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల నుంచి ఇవి భారత్ లోకి ప్రవేశించాయని తెలపింది. ఈ కొత్తరకం స్ట్రెయిన్స్ వల్లనే మళ్లీ మహారాష్ట్ర, కేరళలలో కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. అత్యధికంగా కేరళ, మహారాష్ట్రల్లోనే కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

Tags:    

Similar News