ఏకాభిప్రాయం లేకుండా ముగిసిన ఉండవల్లి సమావేశం

కేంద్ర సాయం, రాష్ట్రానికి జరిగిన అన్యాయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఏకాభిప్రాయం లేకుండానే ముగిసింది. కేంద్రం చేసిన సాయం, చేయాల్సిన [more]

Update: 2019-01-29 09:45 GMT

కేంద్ర సాయం, రాష్ట్రానికి జరిగిన అన్యాయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఏకాభిప్రాయం లేకుండానే ముగిసింది. కేంద్రం చేసిన సాయం, చేయాల్సిన సాయంపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే, కేంద్రం వివరణ తీసుకోకుండా ఇంకా కేంద్రం ఎంత ఇవ్వాలనేది తేల్చలేమని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఆయన పార్టీల వాదనను వ్యతిరేకించారు. దీంతో పాటు పలు అంశాలపై ఏకాభిప్రాయం లేకుండా అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి వైసీపీ, సీపీఎం మినహా మిగతా పార్టీలు హాజరయ్యాయి. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలతో చర్చించేది లేదని ఆ రెండు పార్టీలూ సమావేశాన్ని బహిష్కరించాయి. ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు.

Tags:    

Similar News