బడ్జెట్ 2022-23 : ఏం పెరిగాయ్ ? ఏం తగ్గాయ్ ?

ఈ బడ్జెట్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో కొన్ని వస్తువుల ధరలు తగ్గనుండగా.. మరికొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే కొన్ని

Update: 2022-02-01 10:16 GMT

ఫిబ్రవరి1, మంగళవారం కేంద్రప్రభుత్వం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ 2022ను ఆవిష్కరించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో కొన్ని వస్తువుల ధరలు తగ్గనుండగా.. మరికొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే కొన్ని విదేశీ వస్తువులపై కస్టమ్స్ ట్యాక్స్ తగ్గించగా.. మరికొన్నింటిపై కస్టమ్స్ ట్యాక్ పెరగనుంది. తాజాగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో ధరలు తగ్గనున్న, పెరగనున్న వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం.

ధరలు తగ్గనున్న వస్తువులు
మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ట్రాన్స్‌ఫార్మర్లు, వజ్రాలు, రత్నాలు, పలు రకాల ఇమిటేషన్ జ్యూవెలరీ, పెట్రోలియం పరిశ్రమల్లో ఉపయోగించే కెమికల్స్, మిథనాల్, కెమెరా లైసెన్సులు, స్టీల్ స్క్రాప్, వ్యవసాయ పరికరాలు, దుస్తులు, పాదరక్షలు, విదేశీ యంత్రాలకు సంబంధించిన సామాగ్రి, తోలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
ధరలు పెరగనున్న వస్తువులు
ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, విదేశీ గొడుగులు, క్రిప్టో లావాదేవీల ధరలు పెరగనున్నాయి.
బడ్జెట్‌లో ప్రభుత్వం రత్నాలు, ఆభరణాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించింది. అలాగే కస్టమ్ డ్యూటీని 5 శాతం తగ్గించింది. కట్, పాలిష్ చేసిన వజ్రాలపై కూడా కస్టమ్ డ్యూటీని ప్రభుత్వం 5శాతం తగ్గించింది. దీంతో వాటి ధరలు బాగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.


Tags:    

Similar News