మల్లారెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు

మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణలపై త్వరలోనే పోరాటం చేస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి మల్లారెడ్డి ఏడెకరాల శికం భూమిని ఆక్రమించారని [more]

;

Update: 2021-05-11 00:48 GMT

మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణలపై త్వరలోనే పోరాటం చేస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి మల్లారెడ్డి ఏడెకరాల శికం భూమిని ఆక్రమించారని ఆరోపించారు. అందులో మెడికల్ కళాశాలను నిర్మించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లోనూ శిఖం భూమిగా ఉందని, మల్లారెడ్డి భూ దందాపై కూడా విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మల్లారెడ్డి భూ కబ్జాపై నిలదీసిన వారిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. తాము న్యాయపరంగా కూడా దీనిపై పోరాడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News