Vamsi : లోకేష్ పై వల్లభనేని వంశీ హార్ష్ కామెంట్స్
టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన కామెంట్స్ చేశారు. తాను గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. లోకేష్ ను పోటీ చేయమనండి అని [more]
;
టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన కామెంట్స్ చేశారు. తాను గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. లోకేష్ ను పోటీ చేయమనండి అని [more]
టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన కామెంట్స్ చేశారు. తాను గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. లోకేష్ ను పోటీ చేయమనండి అని వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. చంద్రబాబు, లోకేష్ లలో ఎవరైనా తాను పోటీ కి సిద్దమని వంశీ ఛాలెంజ్ చేశారు. లోకేష్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని అన్నారు. లోకేష్ వంటి నేతలను నమ్ముకుని రాజకీయాలు చేస్తే మునగడం ఖాయమని వల్లభనేని వంశీ అన్నారు.
సునీతమ్మను సారధ్యం వహించండి…..
పరిటాల సునీత వ్యాఖ్యలకు కూడా వల్లభనేని వంశీ రెస్పాండ్ అయ్యారు. పార్టీకి వదినమ్మను సారధ్యవహించమనండి అని ఎద్దేవా చేశారు. వంశీని, కొడాలి నానిని చిత్తుగా ఓడిస్తామని నిన్న పరిటాల సునీత కామెంట్స్ కు వంశీ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు తల్లికి, కడుపులో పుట్టిన బిడ్డకు మధ్య తగవు పెట్టే సమర్థుడని అన్నారు.