వెలగపూడి పంచాయతీకి నల్లరంగు

రాజధాని మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందుకు నిరసనగా వెలగపూడి పంచాయతీకి స్థానికులు నల్లరంగు పులిమి తమ నిరసనలు వ్యక్తం చేశారు. వెలగపూడి పంచాయతీ కార్యాలయానికి నలుపు రంగులు [more]

Update: 2019-12-21 06:02 GMT

రాజధాని మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందుకు నిరసనగా వెలగపూడి పంచాయతీకి స్థానికులు నల్లరంగు పులిమి తమ నిరసనలు వ్యక్తం చేశారు. వెలగపూడి పంచాయతీ కార్యాలయానికి నలుపు రంగులు వేయడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ నిరసన తెలియజేశారు. రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో పార్టీలకు అతీతంగా జాయింట్ యాక్షన్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయస్థానంలో తేల్చుకోవాలన నిశ్చయించారు. మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర రైతులకు సంఘీభావం తెలిపారు. భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేస్తుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. త్యాగం చేసిన రైతులు రోడ్డు మీదకు ఎందుకు వచ్చారో ప్రభుత్వం ఆలోచించుకోవాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రులు మారినా ప్రజలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు కొనసాగించాలని ఆయన కోరారు.

Tags:    

Similar News