నేడు హైదరాబాద్ లో కేంద్ర బృందం పర్యటన
కరోనా వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో నేడు హైదరాబాద్ లో కేంద్ర బృందం పర్యటించనుంది. తొలుత గచ్చిబౌలి స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిని కేంద్ర బృందం [more]
;
కరోనా వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో నేడు హైదరాబాద్ లో కేంద్ర బృందం పర్యటించనుంది. తొలుత గచ్చిబౌలి స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిని కేంద్ర బృందం [more]
కరోనా వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో నేడు హైదరాబాద్ లో కేంద్ర బృందం పర్యటించనుంది. తొలుత గచ్చిబౌలి స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిని కేంద్ర బృందం పరిశీలించనుంది. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిని కూడా కేంద్ర బృందం సందర్శించనుంది. ఆసుపత్రిలో కరోనా చికిత్స, ఉన్న వసతులను కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గురించి తెలుసుకోనుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. కేసులు ఎక్కువగా పెరుగుతున్న మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది.