టీడీపీ సమావేశంలో జగన్ లేఖ...?

Update: 2018-09-05 12:02 GMT

టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ అధినేత జగన్ రాసిన లేఖ చర్చనీయాంశమైంది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా స్పీకర్ కు వైఎస్సార్సీపీ లేఖ రాసింది. తమ పార్టీ నుంచి తీసుకున్న 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే తాము సభకు వస్తామని, వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలో చేరి మంత్రులయిన నలుగురిపై వేటు వేయాలని ఆ లేఖలో కోరారు. వైసీపీ లేఖను పార్టీ మారిన ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. తాము ప్రజల అభిప్రాయం మేరకే పార్టీ మారామని మంత్రి సుజయ కృష్ణ రంగారావు అన్నారు. జగన్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా నిలువరిస్తున్నారన్నారు. అలాగే పార్టీ మారిన మరో నేత గిడ్డి ఈశ్వరి కూడా జగన్ లేఖ పై స్పందించారు. జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. జగన్ రాసిన లేఖకు గట్టిగా సమాధానం ఇస్తామని ఈశ్వరి అన్నారు.

Similar News