పెళ్లిళ్లు, పెళ్లాల గురించి జగన్ కే తెలియాలి

Update: 2018-08-22 07:39 GMT

పెళ్లిళ్లు, పెళ్లాల గురించి జగన్ కే తెలియాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తమను విమర్శించే హక్కు జగన్ కు లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేది ఒక్క టీడీపీ మాత్రమే నని యనమల అభిప్రాయపడ్డారు. కాబోయే ప్రధానిని నిర్ణయించేది తెలుగుదేశం పార్టీయేనని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం అఖండ విజయం సాధిస్తుందని యనమల జోస్యం చెప్పారు. జగన్ ఇటీవల పవన్ కల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని, చంద్రబాబు వివిధ పార్టీలతో ఆరు పెళ్లిళ్లు చేసుకున్నారని అనడం కరెక్ట్ కాదన్నారు. జగన్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని మరో మంత్రి సోమిరెడ్డి అన్నారు. జగన్ వ్యక్తిగత ఆరోపణలకు దిగితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.

Similar News