అంత సులభం కాదట

శాసనమండలిని రద్దు చేసినా అది కేంద్రం ఆమోదించడానికి రెండు మూడేళ్లు పడుతుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మూడు రోజులు సమయం తీసుకున్నా టీడీపీ [more]

Update: 2020-01-27 03:44 GMT

శాసనమండలిని రద్దు చేసినా అది కేంద్రం ఆమోదించడానికి రెండు మూడేళ్లు పడుతుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మూడు రోజులు సమయం తీసుకున్నా టీడీపీ ఎమ్మెల్సీలు ఎవరూ తమ పార్టీలోకి రాకపోవడం వల్లనే వైసీపీ అక్కసుతో శాసనమండలిని రద్దు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని యనమల ఆరోపించారు. 2021 నాటికి ఎక్కువ మంది సభ్యులు వైసీపీకి వస్తారని, ఇక రద్దు చేయడం వల్ల ఆ పార్టీకి ప్రయోజనం ఏంటని యనమల ప్రశ్నించారు. శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసినా మండలి రెండు మూడేళ్లు కొనసాగుతుందన్నారు. వైసీపీ బెదిరింపులకు, కేసులకు టీడీపీ ఎమ్మెల్సీలు లొంగలేదన్నారు. శాసనమండలి రద్దు రాజ్యాంగ విరుద్ధమని యనమల పేర్కొన్నారు.

Tags:    

Similar News