ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు.. ఆ గుర్తు రద్దు చేయమంటూ?

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వైసీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. కత్తెర గుర్తును బ్యాలట్ పేపర్ నుంచి తొలగించాలని కోరింది. పంచాయతీ ఎన్నికలకు [more]

;

Update: 2021-02-12 01:08 GMT

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వైసీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. కత్తెర గుర్తును బ్యాలట్ పేపర్ నుంచి తొలగించాలని కోరింది. పంచాయతీ ఎన్నికలకు వినియోగిస్తున్న బ్యాలట్ పేపర్ లో కత్తెర గుర్తు, నోటా గుర్తు ఒకే పోలికలో ఉన్నాయని వారు అభ్యంతరం తెలిపారు. దీనివల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కత్తెర గుర్తును రద్దు చేయాలని వైసీీపీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కోరింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ ను వైసీపీ కోరింది.

Tags:    

Similar News