జగన్ అను నేను….!!
ఈ విజయం తనపై మరింత బాధ్యతను, విశ్వాసాన్ని పెంచిందని కాబోయే ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన [more]
;
ఈ విజయం తనపై మరింత బాధ్యతను, విశ్వాసాన్ని పెంచిందని కాబోయే ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన [more]
ఈ విజయం తనపై మరింత బాధ్యతను, విశ్వాసాన్ని పెంచిందని కాబోయే ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో కార్యాకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ… ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఇంత ఘనవిజయం ఎవరూ సాధించలేరోమోనని అన్నారు. 25కు 25 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం, 153 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే అధ్యయమని పేర్కొన్నారు. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో ఈ విజయం సాధ్యమైందని అన్నారు. ప్రజలు విశ్వసనీయతకు ఓటేశారని, తనపై విశ్వాసంతో ఓటేశారన్నారు. ఐదు కోట్ల ప్రజల్లో దేవుడు ఒక్కరికే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశం ఇస్తారన్నారు. ఆ అవకాశం తనకు వచ్చిందంటే గొప్ప పరిపాలన అంటే ఎలా ఉంటుందో ఆరు నెలల నుంచి సంవత్సరంలో మంచి ముఖ్యమంత్రి అని చెప్పుకునేలా పరిపాలన అందిస్తానన్నారు. తనకు ఈ విజయం అందించిన ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలు చూశానని పేర్కొన్నారు.‘నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని అన్నారు. అందుకే నవరత్నాలను అమలు చేసేలా మొదటి సంతకం చేస్తానన్నారు. 30వ తేదీన తాను విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తానని తెలిపారు.