బాబు ప్రకటనలపై జగన్ ఫైర్

ప్రజలంతా భద్రంగా దాచుకునే బ్యాంక్ అకౌంట్, ఆధార్ వివరాలు, ఆడవాళ్ల పోన్ నెంబర్లను దొంగతనంగా ప్రైవేటు కంపెనీలకు, జన్మభూమి కమిటీలకు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మీ భవిష్యత్ [more]

Update: 2019-03-29 08:45 GMT

ప్రజలంతా భద్రంగా దాచుకునే బ్యాంక్ అకౌంట్, ఆధార్ వివరాలు, ఆడవాళ్ల పోన్ నెంబర్లను దొంగతనంగా ప్రైవేటు కంపెనీలకు, జన్మభూమి కమిటీలకు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మీ భవిష్యత్ నా బాధ్యత అని చెప్పుకుంటున్నారని వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప జిల్లా బద్వేల్ లో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు మాటలు, టీవీల్లో ప్రకటన చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆడపిల్లల ఫోన్ నెంబర్లు జన్మభూమి కమిటీల వద్ద ఉంటే భద్రత ఉంటుందా అని ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మహిళా తహశీల్దార్ పై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసినా చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. విజయవాడలో కాల్ మనీ రాకెట్ నడుపుతూ టీడీపీ నేతలు ఆడవాళ్ల మాన, ప్రాణాలను దోచుకుంటుంటే చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఆడవాళ్లకు భద్రత లేదన్నారు.

Tags:    

Similar News