విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపండి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిలుపుదల చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కోరారు. కొద్దిసేపటి క్రితం జగన్ కేంద్ర ఉక్కు [more]

;

Update: 2021-06-11 04:25 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిలుపుదల చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కోరారు. కొద్దిసేపటి క్రితం జగన్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో సమావేశమయ్యారు. ఏపీకి సెంటిమెంట్ గా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయవేటీకరణను నిలిపేయాలని కోరారు. అలాగే కాకినాడలో పెట్రో కాంప్లెక్స్, పెట్రో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని జగన్ కోరారు. విభజన హామీలను నెరవేర్చాలని జగన్ కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కేంద్రం నుంచి రావాల్సిన 3,229 కోట్ల బకాయీలను విడుదల చేయాలని జగన్ మంత్రిని కోరారు.

Tags:    

Similar News