Ys jagan : జీర్ణించుకోలేకనే బూతులు…తిట్లు
ప్రజలు తనమీద ప్రేమ చూపుతున్నప్పటికీ ప్రతిపక్షం, ఎల్లోమీడియా జీర్ణించుకోలేకపోతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎవరూ మట్లాడలేని మాటలు తనపై మాట్లాడుతున్నారన్నారు. దారుణమైన బూతులు తిడుతున్నారన్నారు. బూతులు, [more]
ప్రజలు తనమీద ప్రేమ చూపుతున్నప్పటికీ ప్రతిపక్షం, ఎల్లోమీడియా జీర్ణించుకోలేకపోతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎవరూ మట్లాడలేని మాటలు తనపై మాట్లాడుతున్నారన్నారు. దారుణమైన బూతులు తిడుతున్నారన్నారు. బూతులు, [more]
ప్రజలు తనమీద ప్రేమ చూపుతున్నప్పటికీ ప్రతిపక్షం, ఎల్లోమీడియా జీర్ణించుకోలేకపోతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎవరూ మట్లాడలేని మాటలు తనపై మాట్లాడుతున్నారన్నారు. దారుణమైన బూతులు తిడుతున్నారన్నారు. బూతులు, తిట్లు వినలేక కొందరు వైసీపీ అభిమానులు రియాక్ట్ అయ్యారన్నారు. రాష్ట్రంలో వైషమ్యాలను సృష్టిించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రతి అంశంలో వంచన, విద్వేషం కనిపిస్తుందని జగన్ అన్నారు. వ్యవస్థలను కూడా మానేజ్ చేస్తున్నారన్నారు. మత విద్వేషాలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సంక్షేమాన్ని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు.
నగదు జమ….
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగనన్న తోడు కార్యక్రమంలో లబ్దిదారులకు నగదును జమ చేశారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రతి ఏటా జూన్, డిసెంబరు నెలల్లో రెండుసార్లు జగనన్న తోడు కార్యక్రమం ఉంటుందని జగన్ చెప్పారు. ఈ పథకంలో వంద శాతం రికవరీ ఉండాలని అన్నారు.
నేరుగా లబ్దిదారులకే….
సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి నేరుగా లబ్ది దారులకు పథకాలను అందచేస్తున్నామని తెలిపారు. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ కూడా చూడకుండా పథకాలను చేరవేస్తున్నామని చెప్పారు. అర్హత ఉన్న వారందరికీ అన్ని పథకాలను అందచేస్తున్నామని తెలిపారు. అంతా నావాళ్లే, అన్ని ప్రాంతాలు నావే అన్న రీతిలో తాను పాలన సాగిస్తున్నానని జగన్ చెప్పారు. తన పాలన నచ్చబట్టే అన్ని ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఆదరిస్తున్నారన్నారు. ప్రతిపక్షానికి స్థానమే లేకుండా చేశారన్నారు.