ఎప్పటికీ ఉచితంగానే ఇస్తాం… ముఖ్యమంత్రి జగన్

రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తు పథకాన్ని ఎప్పటికీ తొలగించబోమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశంలో జగన్ దీనిపై వ్యాఖ్యానించారు. ఎప్పటికీ అది [more]

;

Update: 2020-09-03 07:30 GMT
జగన్
  • whatsapp icon

రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తు పథకాన్ని ఎప్పటికీ తొలగించబోమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశంలో జగన్ దీనిపై వ్యాఖ్యానించారు. ఎప్పటికీ అది ఉచితంగానే ఉంటుందని చెప్పారు. ఒక్క పైసా కూడా రైతులపై భారం మోపమని జగన్ తెలిపారు. ఒక్క కనెక్షన్ కూడా తొలిగించే ప్రసక్తి లేదని చెప్పారు. మరో 35 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్తు పథకానికి ఢోకా లేదని మంత్రి వర్గ సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు. మీటర్లు బిగించినా రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు ఎంత విద్యుత్తును వాడుకున్నా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఏపీ కేబినెట్ ఉచిత విద్యుత్తు – నగదు బదిలీ పథకానికి ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News