కేసీఆర్ టార్గెట్ గానే ….. ప్రశ్నించడానికే వచ్చా?

వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా బహిరంగ సభలో ఆవేశపూరితంగా ప్రకటించారు. తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. వైఎస్సార్ కాలంలో జరిగిన అభివృద్ధి [more]

Update: 2021-04-09 15:43 GMT

వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా బహిరంగ సభలో ఆవేశపూరితంగా ప్రకటించారు. తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. వైఎస్సార్ కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవీ ప్రస్తుత ప్రభుత్వంలో అమలు జరగడం లేదని వైఎస్ షర్మిల చెప్పారు. ప్రశ్నించడానికే వచ్చానన్నారు. ప్రజల సమస్యలను వినే ఓపిక ఈ దొరలకు ఉందా? అని వైఎస్ షర్మిల నిలదీశారు. కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని షర్మిల ప్రసంగించారు. సచివాలయానికి వెళ్లకుండానే దానిని కూల్చివేశారన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిని ప్రశ్నించడానికే తాను వచ్చానని షర్మిల చెప్పారు. తన తండ్రి అడుగు జాడల్లో నడిచేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. భౌతికంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామే కాని ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తాను గౌరవిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో ఆరు వేలమంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. తెలంగాణలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం దొరగారి ఎడమ కాలి చెప్పు కింద నలిగిపోతుందన్నారు. ఇప్పుడు పార్టీ ఎందుకు పెడుతున్నారని తనను అడిగారని, తాను ఎందుకు ఇప్పుడు పెట్టకూడదని ప్రశ్నించానన్నారు. ఉద్యమనాయకుడిగా కేసీఆర్ అందరికీ న్యాయం చేస్తానని అందరిలాగే తాను భావించానని షర్మిల అన్నారు. కానీ కేసీఆర్ ఏ వర్గానికి న్యాయం చేయలేదన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ బానిస అయిందా? అని అనిపిస్తుందన్నారు. దొర దయతలచి ఇస్తేనే తీసుకోవాలన్నారు. దొర చెప్పిందే వేదమన్నారు.

తన బిడ్డను దీవించండి…

వైఎస్సార్ ధైర్యం, సాహసం షర్మిలకు వచ్చాయని విజయమ్మ అన్నారు. ఖమ్మం బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. తన బిడ్డను దీవించాలన్నారు. రాజన్న రాజ్యం కోసం షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్ ను అందరూ అభిమానించారన్నారు. షర్మిల తన బిడ్డ కానదని, మీ బిడ్డగా ఆశీర్వదించమని విజయమ్మ కోరారు. షర్మిలకు అందరూ అండగా నిలబడాలని కోరారు.

Tags:    

Similar News