జులై 8న పార్టీ ప్రకటన వైఎస్ షర్మిల స్పష్టీకరణ
పార్టీలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామని వైఎస్ షర్మిల చెప్పారు. షర్మిల తెలంగాణలోని 33 జిల్లాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలంటే నినాదాలిచ్చే వారే కాదని, వారు జనం గుండె [more]
పార్టీలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామని వైఎస్ షర్మిల చెప్పారు. షర్మిల తెలంగాణలోని 33 జిల్లాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలంటే నినాదాలిచ్చే వారే కాదని, వారు జనం గుండె [more]
పార్టీలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామని వైఎస్ షర్మిల చెప్పారు. షర్మిల తెలంగాణలోని 33 జిల్లాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలంటే నినాదాలిచ్చే వారే కాదని, వారు జనం గుండె చప్పుడని తన నమ్మకమని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నిత్యం సమస్యలపై పోరాడేది కార్యకర్తలని షర్మిల అభిప్రాయపడ్డారు. తెలంగాణలో వైఎస్ వల్ల లబ్ది పొందని ఇల్లు లేదని షర్మిల చెప్పారు. కార్యకర్తలనే తాము నాయకులుగా తీర్చిదిద్దుతామన్నారు. వైఎస్సార్ జయంతి రోజున జులై 8వ తేదీన పార్టీ పేరును ప్రకటించబోతున్నట్లు షర్మిల ప్రకటించారు. పార్టీలో కార్యకర్తలే కీలకమన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కార్యకర్తలు పార్టీ ఏర్పాటుకు కారణాలను ప్రజలకు వివరించాలని వైఎస్ షర్మిల తెలిపారు.