మూడు రోజుల పాటు దీక్ష చేస్తున్నా

ఎవరు అవునన్నా కాదన్నా తాను తెలంగాణ బిడ్డనని వైఎస్ షర్మిల చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. తాను ఇక్కడే పుట్టానని ఇక్కడ [more]

Update: 2021-04-10 01:26 GMT

ఎవరు అవునన్నా కాదన్నా తాను తెలంగాణ బిడ్డనని వైఎస్ షర్మిల చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. తాను ఇక్కడే పుట్టానని ఇక్కడ గాలి పీల్చుకునే పెరిగానని వైఎస్ షర్మిల చెప్పారు. తాను ఎవరు పంపితేనో రాలేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ లు పంపితే తాను రాలేదని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే పార్టీ పెడుతున్నానని వైఎస్ షర్మిల చెప్పారు. తన పార్టీ ఎవరి కోసమో పనిచేయదని వైఎస్ షర్మిల చెప్పారు. బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు తాటాకు అడిగితే ఈతాకు ఇచ్చారని షర్మిల చమత్కరించారు. చాలా మంది అనుకోవచ్చని, తెలంగాణ ప్రాజెక్టుల కోసం షర్మిల అడ్డుకుంటుందా? అని. కానీ తెలంగాణకు జరిగే ఏ అన్యాయాన్నైనా ప్రశ్నిస్తానని వైఎస్ షర్మిల చెప్పారు. జులై 8న కొత్త పార్టీ పేరును ప్రకటిస్తామని వైఎస్ షర్మిల చెప్పారు. నిరుద్యోగ సమస్యలపై ఈ నెల 15వ తేదీ నుంచి నిరాహార దీక్షలు చేయబోతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. నాలుగో రోజు నుంచి తమ పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్షలు చేస్తారని చెప్పారు.

Tags:    

Similar News