మరోసారి వైఎస్ షర్మిల ఫైర్

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు చేశారు. కరోనా వైరస్ తో తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ షర్మిల ఆవేదన చెందారు. ఆసుపత్రుల్లో [more]

Update: 2021-05-10 00:46 GMT

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు చేశారు. కరోనా వైరస్ తో తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ షర్మిల ఆవేదన చెందారు. ఆసుపత్రుల్లో చేరి డబ్బులు చెల్లించలేక ఆస్తులను కూడా అమ్ముకుంటున్నారని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు చెల్లించకపోతే శవాన్ని కూడా ఆసుపత్రులు ఇవ్వడం లేదన్న వార్తలు హృదయాన్ని కలచి వేస్తున్నాయని వైఎస్ షర్మిల అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కరోనా వైరస్ ఆరోగ్యశ్రీలో చేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Tags:    

Similar News