ys sharmila : ఇంకా ఎంత మంది చనిపోవాలి?

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల హన్మకొండలో దీక్ష ప్రారంభించారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆమె దీక్ష చేపట్టారు. ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేంత వరకూ ముఖ్యమంత్రి [more]

;

Update: 2021-09-14 06:42 GMT

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల హన్మకొండలో దీక్ష ప్రారంభించారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆమె దీక్ష చేపట్టారు. ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేంత వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలను భర్తీ చేయరని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కేసీఆర్ పనితీరు వల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఇంతవరకూ ఆదుకోలేదన్నారు.

Tags:    

Similar News