నేడు వైెఎస్ షర్మిల దీక్ష.. పోలీసుల అనుమతి

వైఎస్ షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఒకరోజుమాత్రమే అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నోటీఫికేషన్ ఇవ్వాలంటూ వైఎస్ షర్మిల [more]

Update: 2021-04-15 00:44 GMT

వైఎస్ షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఒకరోజుమాత్రమే అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నోటీఫికేషన్ ఇవ్వాలంటూ వైఎస్ షర్మిల మూడు రోజుల పాటు దీక్ష చేయాలని నిర్ణయించారు. మూడు రోజుల పాటు ఇందిరాపార్కు వద్ద దీక్ష చేయాలని పోలీసుల అనుమతిని కోరారు. పోలీసులు కోవిడ్ వ్యాప్తి కారణంగా ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. మిగలిని రెండు రోజులు ఇంటివద్దనే దీక్ష చేయాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఈరోజు వైఎస్ షర్మిల ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేయనున్నారు.

Tags:    

Similar News