ఏపీలో ఇక కరువుండదు

Update: 2016-12-30 11:10 GMT

పోలవరం నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ లో ఇక కరువుండదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పోలవరం నిర్మాణానికి సంబంధించిన అడ్డంకులన్నీ అధిగమించామని బాబు చెప్పారు. ఇందుకు కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. పోలవరం నిర్మాణం కోసం ఇప్పటి వరకూ 2250 కోట్లు ఖర్చు చేశామని, అందులో నాబార్డు 1981 కోట్ల రుణం ఇచ్చిందన్నారు. గిరిజనులను దేవుళ్లుగా చంద్రబాబు అభివర్ణించారు. భూనిర్వాసితులకు కొత్త చట్టం ప్రకారమే నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. రాజధాని అమరావతి కోసం భూమిని ఇచ్చిన రైతుల సహకారాన్ని మరువలేనని ఆయన అన్నారు. ఈరోజు పోలవరం స్పిల్ వే కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. కేంద్రం సహకారం అందించడం వల్లనే పోలవరం సాధ్యమైందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్లనుంచి పోలవరాన్ని పక్కన పెట్టేసిందని విమర్శించారు.

Similar News