Gold Price Today : శుక్రవారం షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్దిగా పెరిగాయి;

Update: 2024-09-06 02:45 GMT

పసిడి ధరలు ఎందుకో పరుగును ఆపి కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు పది రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ధరలు తగ్గింది స్వల్పంగానే అయినా పెరగకపోవడం బంగారం ప్రియులకు అది ఊరటనిచ్చే అంశంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే వచ్చే నెల నుంచి సీజన్ ప్రారంభం అవుతుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతాయి. వాటి కోసం ఇప్పటి నుంచే కొనుగోళ్లు చేయడానికి వినియోగదారులు జ్యుయలరీ దుకాణాలకు వస్తున్నారు. ఈ తరుణంలో బంగారం, వెండి ధరలు తగ్గుతుండటం చాలా వరకూ రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి.

ధరలు పెరగడానికి...
ఈరోజు ధరలు పెరిగినా స్వల్పంగానే పెరిగాయి. శుక్రవారం కూడా భారీగా ధరలు పెరగలేదు. పసిడి అంటేనే ఎక్కువ మంది ఇష్టపడుతుండటంతో వాటి డిమాండ్ పెరిగి ధరలపై కూడా వాటి ప్రభావం చూపుతాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, దిగుమతులు తగ్గడం వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోట చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. అందుకు అనుగుణంగానే ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే భారీగా పెరగకపోవడం, అదే స్థాయిలో తగ్గకపోవడం కూడా ఒకింత మంచిదేనని అంటున్నారు.
స్వల్పంగా పెరిగి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్దిగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. అయితే ఈరోజు ఉదయం ఆరు గంటల వరకూ ఉన్న ధరలు ఇవి. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,690 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,760 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 89,900 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News