జానాకు....కోపం వచ్చింది.

Update: 2016-12-20 09:02 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం జానారెడ్డి ఫైర్ అయ్యారు. జానారెడ్డి మనస్సుల్లో ఉన్న ఉక్రోషాన్ని వెళ్లగక్కారు. రాష్ట్ర అర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ....నా తెలంగాణ...నా ...తెలంగాణ బిడ్డలు అని సంభోదించడాన్ని జానా తప్పుపట్టారు. ఈటెల వ్యాఖ్యలపై జానా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటి? నా తెలంగాణ....నా తెలంగాణ బిడ్డలు....అని అంటారు. మన తెలంగాణ...మన తెలంగాణ బిడ్డలు అని అనలేరా? ఈ ముఖ్యమంత్రి తెలంగాణ కోసం నా ఇంటికి వచ్చి నన్ను నిద్రలేపి మరీ తెలంగాణ కోసం పోరాడేందుకు సహకరించాలని కోరలేదా? అని జానా ప్రశ్నించారు. తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది? మీవల్లే వచ్చిందా? తెలంగాణ ఇచ్చింది ఎవరు? మేం కాదా? సోనియా గాంధీ ఇవ్వలేదా? ఏం మాట్లాడుతున్నారు? ఆరోజు కేంద్రంలో...అధికారంలో ఉన్నది మేమే. ఆరోజు ఉద్యమాన్ని అణగదొక్కాలనుకుంటే ఎంతోసేపు పట్టేది కాదు అని జానా ఫైర్ అయ్యారు. దీనిపట్ల మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వయస్సులో పెద్ద వారై ఉండి...ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడం అన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కేటీఆర్ కోరారు. తర్వాత జానా వివరణ ఇచ్చుకున్నారు.

Similar News