అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు కళ్లెం పడింది. వరుస సంచలన నిర్ణయాలతో ప్రపంచదేశాలను వణికిస్తున్న ట్రంప్ కు ఫెడరల్ కోర్టు తీర్పుతో చుక్కెదురైంది. ఏడు ముస్లిందేశాల ప్రజలకు అమెరికాలో ప్రవేశించడాన్నితీసుకున్న నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు తప్పు పట్టింది. అతి తక్కువ సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నందున ప్రజలు ఇబ్బందులు పడతారని కోర్టు భావించింది.
డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అప్పడే అమలై పోయింది. న్యూయార్క్ లోని విమానాశ్రయంలో కొందరు శరణార్ధులను పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. ట్రంప్ నిర్ణయంపై ఫెడరల్ కోర్టు స్టే విధించింది. దీంతో అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి ట్రంప్ పరాభవం ఎదుర్కొన్నారని భావిస్తున్నారు. అమెరికాలో అడుగుపెట్టిన రెండు వందల మంది వరకూ శరణార్ధులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.