తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం

Update: 2017-08-21 12:07 GMT

తమిళనాడు డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో కొద్దిసేపటి క్రితమే పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. పన్నీర్ సెల్వం జయలలిత బతికున్నప్పుడే రెండుసార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే జయ మరణం తర్వాత అనూహ్య పరిస్థితుల్లో పన్నీర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పన్నీర్ సెల్వానికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆర్థిక శాఖను కూడా కేటాయించారు. పన్నీర్ తో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Similar News