ధరలు పెరగనున్నవి ఇవే...

Update: 2017-02-01 09:52 GMT

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కొన్ని విలాసవంతమైన వస్తువుల ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా సిగిరెట్లు, పాన్ గుట్కా, సెల్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. ధూమపాన ప్రియులకు జైట్లీ పొగపెట్టేశారు. వెయ్యి సిగిరెట్ల పై రూ.215 ల నుంచి రూ.311ల కు పెంచారు. పాన్ గుట్కాలపై ఆరు నుంచి తొమ్మిది శాతానికి పెంచారు. దీంతో పాన్, సిగిరెట్లు, గుట్కా ధరలు పెరగున్నాయి. ఇంకోవైపు దిగుమతి చేసుకునే అల్యూమినియం పై 30 శాతం పన్ను పెరగనుంది. దీంతో అల్యూమినియం వస్తువుల రేట్లు కూడా పెరుగుతాయి.

ఇక సెల్ ఫోన్ల ధరలు కూడా పెరిగే అవకాశముంది. సెల్ ఫోన్ తయారీకి వినియోగించే సర్క్యూట్ బోర్డ్ లపై ప్రభుత్వం 2 శాతం పన్ను విధించడంతో ఇక సెల్ ఫోన్ల ధరలు పెరగక తప్పవు. ఎల్ ఈడీ బల్బుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎల్ఈడీ బల్బుల తయారీకి ఉపయోగించే వస్తువలుపై 5 శాతం పన్ను విధించారు. మరోవైపు విందులు వినోదాలకు కూడా ఇక చెక్ పెట్టక తప్పదు. హోటళ్లకు వెళ్లే వారికి సర్వీస్ ట్యాక్స్ రూపంలో మరింత ఛార్జి వసూలు చేయనున్నారు.

Similar News