భద్రతా దళాల్లో సమన్వయ లోపం.....

Update: 2017-02-06 01:02 GMT

పఠాన్‌ కోట్‌ సైనిక స్థావరంపై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడిని తిప్పికొట్టే సమయంలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌(ఎన్‌ఎస్‌జీ) - ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి అభిప్రాయ భేదాలు తలెత్తిన విషయం బయటకు పొక్కింది. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన డిఫెన్స్‌ సెక్యూరిటీ గార్డ్స్ ను కాపాడామని ఎయిర్‌ఫోర్సు అధికారులు కోరినా.., ఎన్‌ఎస్‌జీ బలగాలు పట్టించుకోని విషయం జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టికి వచ్చింది. దాడి తర్వాత ఎయిర్‌ఫోర్స్‌ అధికారి ఎన్‌ఐఏ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాన్ని బయటపెట్టారు.పఠాన్‌కోట్‌ ఘటనపై ల ఎన్‌ఐఏ కోర్టుకు ఛార్జిషీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఎన్‌ఎస్‌జీ - ఎయిర్‌ఫోర్స్‌కు మధ్యనున్న విభేదాలు సంచలనం సృష్టించాయి.

వింగ్‌ కమాండర్‌ అభిజిత్‌ సరీన్‌ ఎన్‌ఐఏకిచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఉగ్రదాడిలో''ఒకరు చనిపోయారు. మరో ఇద్దరం తీవ్రగాయాలతో ఉన్నామని.,. మమ్మల్ని తరలించకపోతే ప్రాణాలు కోల్పోతామని డిఫెన్స్‌ సెక్యూరిటీ కాప్స్‌ను వైర్‌లెస్‌ సెట్‌లో కోరామని చెప్పారు. ఎన్‌ఎస్‌జీ కమాండో బృందానికి నేతృత్వం వహిస్తున్న గౌతమ్‌ గంగూలీని రక్షించమని కోరినా ఆయన పట్టించుకోలేదని వివరించారు.

ఉగ్రమూకను అడ్డుకునేందుకు అభిజీత్‌ను ఎన్‌ఎస్‌జీ బృందానికి మార్గదర్శకంగా ఉండేదుకు ఎయిర్‌ఫోర్స్‌ నియమించింది. మరోవైపు ఎన్‌ఎస్‌జీ.. అభిజిత్ ఆరోపణల్ని ఖండించింది. ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది అడ్డదిడ్డంగా కాల్పులు జరుపుతూ పరుగులు తీస్తుండటంతో గందరగోళం నెలకొందన్న విషయాన్ని బ్రిగేడియర్‌ గంగూలీ ఎన్‌ఐఏకు తెలిపారు. 'డీఎస్‌సీ పరిధిలోని ప్రాంతంలో కాల్పులు జరిగే దిశ తరచూ మారిపోతోంది. దీంతో బ్రిగేడియర్‌ అనుదీపీందర్‌ నేతృత్వంలోని సైనిక పటాలం అక్కడకు చేరుకుంది. వారితో కలిసి తెల్లవారుజామున డిఫెన్స్‌ సెక్యూరిటీ గార్డ్‌ పరిధిలోని జనావాస ప్రాంతంతో సహా మొత్తం గాలింపు చేపట్టాం. అదేసమయంలో డీఎస్‌సీ సిపాయి జగదీష్‌ రామ్‌ ఒక ఉగ్రవాదిని కాల్చిచంపారని గంగూలీ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అదనపు బలగాలు వచ్చే వరకు ఉగ్రవాదులు ముందుకు రాకుండా భద్రత కోసం అక్కడ ఉన్నారా., గాయపడిన డీఎస్‌సీ సిబ్బందిని రక్షించేందుకు బృందాన్ని పంపించారో ఆయన వాగ్మూలంలో చెప్పలేదు. ఆర్మీ బ్రిగేడియర్‌ అనుదీపీందర్‌ వాగ్మూలంలో మాత్రం 'ఎయిర్‌ఫోర్స్‌ అధికారి చెప్పిన డీఎస్‌సీ సిబ్బందిని రక్షించేందుకు దాదాపు 100 మంది దళాలను ఒక ప్రధాన రక్షణ వాహనంతో పంపిచినట్లు ఎన్‌ఐఏకు తెలిపారు . ఈ మొత్తం వ్యవహారంలో గాయపడిన సిబ్బందిని ఎవరు కాపాడారో అభిజిత్‌కు తెలీదు. ఎయిర్‌ఫోర్స్‌ - ఎన్‌ఎస్‌జీలు దాఖలు చేసిన ఛార్జిషీట్లోని పేర్కొన్న అంశాల్ని పరిశీలిస్తే. ఇరువర్గాల మధ్య సరైన సమన్వయం లేదని స్పష్టవుతుంది. కీలకమైన సమయంలో రెండు ప్రధాన దళాల మధ్య సమన్వయ లోపం ఉందన్న విషయం బయటకు రావటం కలకలం రేపుతోంది

Similar News