భన్వర్‌లాల్‌పై సీఈసీకి టీడీపీ ఫిర్యాదు

Update: 2017-08-21 09:30 GMT

నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం సీఈఓ భన్వర్‌లాల్‌పై టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తెలుగు దేశం పార్టీ తరపున లేవనెత్తిన అభ్యంతరాలను భన్వర్‌లాల్‌ బుట్టదాఖలు చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. నంద్యాల ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నామినేషన్‌ వేసినప్పటి నుంచి ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. శిల్పా నామినేషన్‌ కోసం సమర్పించిన అఫిడవిట్లలో నోటరీ సంతకం చెల్లదని చెప్పినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని ఆరోపించారు. నోటరీపై సంతకాలు చేసిన రామ తులసిరెడ్డి నోటరీ లైసెన్స్‌ నాలుగేళ్ల క్రితమే ముగిసిందని తాము ఫిర్యాదు చేసినా ఆర్వో పట్టించుకోలేదని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. నంద్యాల శివార్లలో ముఖ‌్యమంత్రి ప్యాంట్రీ కారును వైసీపీ నాయకులు అడ్డుకుని., డబ్బు తరలిస్తున్నారంటూ అడ్డుకుని రాద్దాంతం చేసి తాళాలు పగులగొట్టించారని., వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన వెంటనే ముందు వెనుక ఆలోచించకుండా ఎన్నికల సంఘం అధికారులు తాళాలు పగలగొట్టించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఆధీనంలో ఉన్న వాహనాన్ని అడ్డుకోవడం నిబంధనలకు విరుద్ధం అవునో కాదో తేల్చాలని డిమాండ్‌ చేశారు.సాక్షి పత్రికలో వచ్చే కథనాలు., వాస్తవాలకు భిన్నంగా ., దానిని కరపత్రంగా వాడుకుంటున్నారని., పెయిడ్‌ న్యూస్‌ లాంటి కథనాలు వస్తున్నాయని తాము ఫిర్యాదు చేసిన ఎన్నికల సంఘం పట్టించుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు డిఎస్పీ మీద ఫిర్యాదు చేస్తే వెంటనే విధుల నుంచి తప్పించారని మండిపడ్డారు. వైసీపీ నేత చంద్రమోహన్‌ రెడ్డి మెయిల్‌కు స్పందనగా సర్వేలు., నిలిపివేయాలని రద్దు చేయాలని భన్వర్‌లాల్‌ ఆదేశించారని., అలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్నారు.

భన్వర్ లాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.......

98లో సర్క్యూలర్‌ 48గంటల ముందు ఎలాంటి సర్వేలైనా చేసుకోవచ్చని ఈసీ ఆదేశాలు ఇచ్చిందని., ఫలితాలు మాత్రం ఎన్నికలయ్యే వరకు విడుదల చేయకూడదని నిబంధనలు ఉన్నాయని., వాటికి విరుద్ధంగా భన్వర్‌లాల్‌ ఎందుకు వ్యవహిరించారో విచారించాలని డిమాండ్‌ చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఏకధాటిగా జరుగుతున్న పరిణమాలకు సమాధానం చెప్పాలని కోరామని., స్థానిక ఆర్వో నుంచి సిఈఓ వరకు ఫిర్యాదు చేసినా వాటికి సమాధానం లేకపోవడం వల్లే సీఈసీని ఆశ్రయించామని ఎంపీలు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రిని తీవ్ర విమర్శలు చేసినా భన్వర్‌లాల్‌ పట్టించుకోలేదని ముఖ్యమంత్రిని ఊరితీయాలని., బట్టలూడదీయాలని., కాల్చి చంపాలని విమర్శించినా ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోలేదో సీఈసీ నిగ్గు తేల్చాలని కోరారు. జగన‌‌ మొదటి సారి కాల్చి చంపాలి అన్నపుడే ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని రామ్మోహన్‌ నాయుడు ఆరోపించారు. తమ ఫిర్యాదులకు ఎంత మేరకు విచారణ జరిపించారో సమాధానం చెప్పాలని కోరారు. ఎన్నికలు దగ్గరపడుతున్నా నిబంధనల మేరకు వ్యవహరించడం లేదని విమర్వించారు. ఎక్కడ తప్పులు జరిగాయో వాటిని సరిచేయాలని ఎంపీలు నిమ్మల కిష్టప్ప., శ్రీరాం మాల్యాద్రి కోరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేయాల్సి ఉన్నా నంద్యాల ఉపఎన్నికల్లో అలా జరగడం లేదని నంద్యాలలో జరుగుతున్న లోటు పాట్ల గురించి కొన్ని అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు. ఏ పార్టీ వారైనా ఫిర్యాదు చేసినపుడైన ఎన్నికల సంఘం ఒకేలా స్పందించాల్సి ఉందని అయితే వైసీపీ ఫిర్యాదులకు వేగంగా స్పందించిన ఎన్నికల సంఘం., టీడీపీ ఫిర్యాదుల్ని ఎందుకు పట్టించుకోలేదని ఆరోపించారు.

Similar News