ఒంగోలులో రెండు ఒమిక్రాన్ కేసులు
దుబాయ్ నుంచి వచ్చిన ప్రకాశం జిల్లాలోని ఒక మహిళకు ఒమిక్రాన్ సోకింది;
దుబాయ్ నుంచి వచ్చిన ప్రకాశం జిల్లాలోని ఒక మహిళకు ఒమిక్రాన్ సోకింది. చీరాలలోని ఒక కుటుంబం దుబాయ్ నుంచి ఇటీవలే చీరాలకు వచ్చింది. ఆ కుటుంబ సభ్యులకు కరోనా, ఒమిక్రాన్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ కుటుంబంలో ఒక మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ మహిళను వెంటనే ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రాణాపాయం లేదని...
ప్రకాశం జిల్లాలో ఇటీవల సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా సోకింది. ఆయనకు కూడా ఇదే ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇద్దరికీ ప్రాణాపాయం లేదని, త్వరలో కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు.