ఏపీ సచివాలయాలలో ఆధార్ సేవలు.. నేడు చివరి తేదీ
ఈ రోజులలో ఆధార్ జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది. ఆధార్ లేనిది ఏ పని జరగని పరిస్థితినెలకొంది. అయితే అన్ని ..;
ఈ రోజులలో ఆధార్ జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది. ఆధార్ లేనిది ఏ పని జరగని పరిస్థితినెలకొంది. అయితే అన్ని పత్రాలకు ఆధార్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి. ఇక ఆధార్‌కు మొబైల్ నంబర్‌ను కూడా లింక్ చేయడం తప్పనిసరి. ఏదైనా ఆధార్‌లో మార్పులు చేయాలన్నా మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు జనాలకు మరింత వెసులుబాటు కల్పించే సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తోంది. గ్రామ సచివాలయాలలోనే ఆధార్ సేవలు అందిస్తున్నాయి. ఇక ఏపీలో ప్రభుత్వం ఆధార్‌కు సంబంధించిన తదితర సేవలను కల్పించేందుకు ప్రత్యేక క్యాంప్‌లను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఈ ఆధార్ సర్వీసులను అక్టోబర్ 25 నుంచి 28వ తేదీ వరకు ఆధార్ సేవలు అందిస్తుండగా, నేడు చివరి రోజు. ఏదైనా ఆధార్ సమస్యలు ఉంటే సచివాలయాలలో పొందవచ్చని అధికారులు తెలిపారు.
సచివాలయాలలో అందించు ఆధార్ సేవలు:
1). ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్...
2). ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్...
3). బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్...
4). పేరు మార్పు (ఆధారం (ప్రూఫ్ తప్పనిసరి)
5). పుట్టిన తేదీ మార్పు (ఫ్రూప్ తప్పనిసరి)
6). జెండర్ మార్పు
7). ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్
8). చిరునామా మార్పు (ఫ్రూప్ తప్పనిసరి)
9). కొత్తగా ఆధార్ నమోదు
10). ఆధార్ డౌన్‌లోడ్ సదుపాయం
సేవలకు అయ్యే ఖర్చు:
క్రమ సంఖ్య 1,2,4,5,6,7,8 పిల్లకు రూ: 50/-
క్రమ సంఖ్య 3 కు రూ: 100/-
క్రమ సంఖ్య 9 కి, బయోమోట్రిక్ అప్‌డేట్ సేవలు ఉచితం
క్రమ సంఖ్య 3, మిగిలిన ఏ సేవలకైన రుసుము రూ: 100/- మాత్రమే