పార్టీ నేతలతో రేపు జగన్ భేటీ వాయిదా..రేపు పులివెందులకు జగన్

పార్టీ ఓటమి చెందిన తర్వాత తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఆయన పర్యటిస్తున్నారు.;

Update: 2024-06-18 07:39 GMT
పార్టీ నేతలతో రేపు జగన్ భేటీ వాయిదా..రేపు పులివెందులకు జగన్
  • whatsapp icon

రేపు పులివెందులకు మాజీ ముఖ్యమంత్రి జగన్ వెళ్లనున్నారు. పార్టీ ఓటమి చెందిన తర్వాత తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఆయన పర్యటిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలతో అక్కడ భేటీ కానున్నారు. ఇడుపులపాయ గెస్ట్ హౌస్ వద్ద జగన్ నేతలతో సమావేశమై వారికి భరోసా ఇవ్వనున్నారు. తిరిగి ఈ నెల 21వ తేదీన పులివెందుల నుంచి తాడేపల్లికి చేరుకోనున్నారు.

ముందుగా నిర్ణయించిన...
అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం పార్టీ నేతలతో జగన్ భేటీ వాయిదా పడింది. ఆ సమావేశం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో పార్టీ అధినేత జగన్ నిర్వహించనున్న కీలక భేటీ ఈ నెల 19వ తేదీ జరగాల్సి ఉండగా పులివెందుల పర్యటనతో ఈ నెల 22వ తేదీకి వాయిదా పడింది. ఎన్నికల్లో దారుణ ఓటమి, భవిష్యత్ కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉందని తెలిసింది.



Tags:    

Similar News